Wednesday, April 16, 2025
HomeTrending Newsవైఎస్ కుటుంబాన్ని చీల్చడంలో బాబు సఫలం: పెద్దిరెడ్డి

వైఎస్ కుటుంబాన్ని చీల్చడంలో బాబు సఫలం: పెద్దిరెడ్డి

విశాఖ రైల్వే జోన్‌కు జనవరిలోనే రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ప్రత్యేక హోదాపై టీడీపీ, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తున్నాయని, చంద్రబాబు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే దుష్ప్రచారం చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిందే బాబు అని, ఆయన వల్లే హోదా తీసుకురాలేకపోతున్నామని అన్నారు. వైఎస్ కుటుంబాన్ని చీల్చడంలో బాబు సఫలీకృతులయ్యారని, వైఎస్ ఆశయాలను ఎవరు నేరవేస్తున్నారో ప్రజలకు తెలుసని, వైఎస్ ఒక అడుగు ముందుకేసి ప్రజలకోసం పనిచేస్తే జగన్ పది అడుగులు వేశారని కొనియాడారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా జనం జగన్ వైపే ఉన్నారన్నారు.
చంద్రబాబు టిక్కెట్లు అమ్ముకుంటున్నారని, ఈ విషయాన్ని కేశినేని నాని కూడా చెప్పారని మంత్రి గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని, షర్మిలను చంద్రబాబు రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారని, ఆమె సిఎం జగన్ పై అకారణంగా ఆరోపణలు చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్