Monday, June 15, 2026
Homeస్పోర్ట్స్IND Vs. Eng: జైస్వాల్ జోరు - ఇండియా 336/6

IND Vs. Eng: జైస్వాల్ జోరు – ఇండియా 336/6

యశస్వి జైస్వాల్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ తో రాణించడంతో ఇంగ్లాండ్ తో జరుగుతోన్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ మొదటిరోజు ఇండియా గౌరవప్రదమైన స్కోరు చేసింది. విశాఖలోని డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ- వీడీసిఏ స్టేడియంలో నేడు మొదలైన రెండో టెస్టులో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 40 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ (14) ఔటయ్యాడు. శుభ్ మన్ గిల్ 34 పరుగులు చేసి 89 పరుగుల వద్ద వెనుదిరిగాడు. జైస్వాల్- శ్రేయాస్ అయ్యర్ లు మూడో వికెట్ కు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయ్యర్ 27 రన్స్ చేసి పెవిలియన్ చేరగా, గాయంతో వైదొలిగిన కెఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చి టెస్ట్ క్రికెట్ ఆరంగ్రేటం చేసిన రజిత్ పటీదార్ 32 పరుగులు చేసి ఔట్ కాగా…  లోకల్ బాయ్, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ 17 పరుగులుచేసి వెనుదిరిగాడు.

తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 6 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. జైస్వాల్ 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 179; రవిచంద్రన్ అశ్విన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్  చెరో 2; అండర్సన్, హార్ట్లీ చెరో వికెట్ పడగొట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular