Thursday, June 11, 2026
HomeTrending Newsములాయంకు బాబు నివాళులు

ములాయంకు బాబు నివాళులు

సమాజ్ వాదీ పార్టీ  వ్యవస్థాపక అధ్యక్షుడు,  యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కు ఏపీ మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. అనారోగ్యంతో నిన్న మృతి చెందిన ములాయం భౌతిక కాయాన్ని అయన స్వగ్రామమైన ఉత్తరప్రదేశ్ లోని ఇటావా జిల్లా సైఫయి కి తరలించారు.  రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు తరలి వచ్చారు.  దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి అనేక పార్టీలకు చెందిన నేతలు సైఫయి చేరుకొని ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

టిడిపి ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ లతో కలిసి  యూపీ వెళ్ళిన చంద్రబాబు ములాయం కు పుష్పాంజలి ఘటించారు, అనంతరం ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ ను ఓదార్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular