Wednesday, June 26, 2024
HomeUncategorizedకల్కి' ప్రీ రిలీజ్ కు సిఎం, డిప్యూటీ సిఎం!

కల్కి’ ప్రీ రిలీజ్ కు సిఎం, డిప్యూటీ సిఎం!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 AD’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమరావతిలో నిర్వహించాలని నిర్మాత అశ్వనీ దత్ భావిస్తున్నారు. దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను అతిథులుగా ఆహ్వానించాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. వీరిద్దరితో పాటు మెగా స్టార్ చిరంజీవి, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లను కూడా ఆహ్వానించనున్నారు.

అటు వైజయంతీ మూవీస్ బ్యానర్ లోను .. ఇటు ప్రభాస్ కెరియర్ లోను భారీ బడ్జెట్ తో నిర్మితమైన సినిమా ఇది. సైన్స్  ఫిక్షన్ కి ఇతిహాసాన్ని జోడిస్తూ వెళ్లిన కథ ఇది. ప్రభాస్ పూర్తి డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ప్రభాస్ కు జంటగా దీపికా పడుకొనే, దిశా పటానీ నటిస్తోన్న ఈ సినిమాలో ఆల్ ఇండియా స్టార్ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని కీలమైన పాత్రలను పోషించారు. వీరితో పాటు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా అతిథి పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇంతమంది భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా ఫంక్షన్ ను అమరావతి కేంద్రంగా నిర్వహించి ఈ స్టార్ లు అందరినీ అక్కడకు తీసుకెళ్ళి ఘనంగా వేడుక నిర్వహించేలా అశ్వనీ డాట్ ప్లాన్ వేస్తున్నారు. జూన్ 27వ తేదీన వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. పోలవరం పర్యటన, మంత్రివర్గ సమావేశం, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చంద్రబాబు షెడ్యూల్ బిజీగా ఉంది, ఈ వారం చివర్లో వేడుక జరిగే అవకాశం ఉంది,

RELATED ARTICLES

Most Popular

న్యూస్