Saturday, February 22, 2025
HomeTrending Newsఇదే స్ఫూర్తితో పనిచేయండి: బాబు పిలుపు

ఇదే స్ఫూర్తితో పనిచేయండి: బాబు పిలుపు

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో సాధారణ ఎన్నికల వరకూ ఇలాగే కష్టపడి పనిచేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేతలు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈ ఫలితాలతో వెల్లడైందని అభిప్రాయపడ్డారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ట్రెండ్స్ పై బాబు సంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగుదేశం అభ్యర్ధులు అందరూ బాగా కష్టపడ్డారని, ప్రజల మద్దతు మన పార్టీకి ఉందని రుజువైదని వ్యాఖ్యానించారు. ప్రలోభాలకు గురి చేసినా గ్రాడ్యుయేట్స్ లొంగలేదని, దీనిద్వారా వ్యతిరేకత ఏస్థాయిలో ఉందో తెలుస్తోందన్నారు. ఢిల్లీ పర్యటన ద్వారా సిఎం జగన్  రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పాలని బాబు డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో రాబోయే రోజుల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, చర్చించాల్సిన అంశాలపై బాబు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేశారు.

Also Read : టిడిపి వెంట గ్రాడ్యుయేట్లు, వైసీపీని గెలిపించిన టీచర్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్