Wednesday, June 17, 2026
Homeసినిమా'ఉగ్రం' ఫస్ట్ సింగిల్ 19న విడుదల

‘ఉగ్రం’ ఫస్ట్ సింగిల్ 19న విడుదల

అల్లరి నరేష్, విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం‘ తో వస్తున్నారు. అల్లరి నరేష్‌ని ఫెరోషియస్ పోలీస్‌ గా చూపించిన ఉగ్రం టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ దేవేరిను మార్చి 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. వర్షం పడుతుండగా అల్లరి నరేష్ , మిర్నా బైక్‌ పై కూర్చొని వున్న అనౌన్స్ మెంట్ పోస్టర్‌ ని చూస్తుంటే… దేవేరి ఒక అందమైన రొమాంటిక్ మెలోడీ అనిపిస్తుంది.

యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘ఉగ్రం’ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. తూమ్ వెంకట్ కథ అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. సిద్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. ఈ ఏడాది వేసవిలో సినిమాను థియేటర్లలో విడుదల కానుంది. నాంది సినిమా వలే ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించి అల్లరి నరేష్ కు మంచి పేరు తీసుకువస్తుందని మేకర్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular