Wednesday, June 17, 2026
HomeTrending Newsశనివారం కూడా విస్తారంగా వర్షాలు

శనివారం కూడా విస్తారంగా వర్షాలు

ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ శనివారం భారీ వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి  డా. బి.ఆర్.అంబేద్కర్ వెల్లడించారు.  శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, భారీ వర్షాలు, పిడుగుపాటు నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములతో కూడిన వర్షం ఉన్నపుడు పొలాల్లో, చెట్ల క్రింద ఉండరాదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Also Read : Cyclone Gulab : తెలుగు రాష్ట్రాలకు గులాబ్ తుఫాన్ హెచ్చరిక

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular