Sunday, January 19, 2025
HomeTrending Newsతిరిగి రాజ్యసభకు బీద, ఎమ్మెల్సీగా మోపిదేవి!

తిరిగి రాజ్యసభకు బీద, ఎమ్మెల్సీగా మోపిదేవి!

వైఎస్సార్సీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ కర్ ను కలిసి తమ రాజీనామా లేఖలు సమర్పించారు. రాజ్య సభ సభ్యత్వంతో పాటు పార్టీకి కూడా గుడ్ బై చెప్పారు. త్వరలోనే ఈ ఇరువురు నేతలూ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.

బీదా మస్తాన్ రావుకు తిరిగి రాజ్యసభకు పంపాలని, మోపిదేవిని ఎమ్మెల్సీగా చేసి వీలును బట్టి రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.

ప్రత్యేక పరిస్థితుల్లోనే వైసీపీని వీడుతున్నట్లు మోపిదేవి చెప్పగా, వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు బీదా మస్తాన్ రావు వెల్లడించారు. తనకు ఎంపిగా అవకాశం కల్పించిన జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్