Wednesday, May 7, 2025
Homeసినిమావైష్ణవి చైతన్యకు 'బేబీ' టీమ్ బర్త్ డే విషెస్

వైష్ణవి చైతన్యకు ‘బేబీ’ టీమ్ బర్త్ డే విషెస్

Birthday Poster: న్యూ ఏజ్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న సినిమా ‘బేబీ‘. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లు. టాలెంటెడ్ డైరెక్టర్ సాయి రాజేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దసరా పండగ‌కి లాంఛనంగా ప్రారంభమైన ‘బేబీ’ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంతో వైష్ణవి చైతన్య నాయికగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇవాళ  ఆమె పుట్టినరోజు సందర్భంగా టీమ్ మెంబర్స్ విషెస్ తెలిపారు.

వైష్ణవి చైతన్య స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. పొయెటిక్ గా డిజైన్ చేసిన బర్త్ డే పోస్టర్ లో వైష్ణవి చైతన్య చిరునవ్వుతో ఆకట్టుకుంటోంది. విజయ్ దేవరకొండతో టాక్సీవాలా లాంటి సూపర్ హిట్ సినిమా నిర్మించిన ఎస్. కె. ఎన్ ‘బేబీ’ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్త సంస్థ మాస్ మూవీ మేకర్స్ పతాకం పై ‘బేబీ’ సినిమా నిర్మితమవుతోంది.

Also Read : న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘బేబీ’ ప్రారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్