Friday, March 29, 2024
HomeTrending Newsపాకిస్తాన్ లో హిందూ వ్యాపారి హత్య

పాకిస్తాన్ లో హిందూ వ్యాపారి హత్య

Assassination Of A Hindu Businessman In Pakistan :

పాకిస్తాన్ లో ఓ హిందూ వ్యాపారిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సింద్ ప్రావిన్స్ లోని అనాజ్ మండిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాల్పుల్లో 44 ఏళ్ళ సునీల్ కుమార్ అనే హిందూ వ్యాపారి చనిపోయారు. వ్యాపారి హత్యకు నిరసనగా అనాజ్ మండి లో స్థానిక హిందువులు, వివిధ పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. దారుణ కృత్యానికి ఒడి గట్టిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం విఫలమైందని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఆరోపించింది. మైనారిటీలకు రక్షణ కల్పించడంలో ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నిర్లక్ష్యం వహిస్తున్నారని, అంతర్జాతీయంగా పాకిస్తాన్ అప్రతిష్ట పాలవుతోందని పాకిస్తాన్ ముస్లీం లీగ్ నేత మరియం నవాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

పాకిస్తాన్ లో మైనారిటీలకు రక్షణ లేకుండా పోతోంది. మైనారిటీల ప్రార్థన మందిరాల మీద మైనారిటీ సమూహాల మీద దాడులు తరచుగా జరుగుతున్నాయి. హిందువులు, అహ్మదీయులు,క్రైస్తవుల మీద కొంత కాలంగా దాడులు చేయటం పరిపాటిగా మారింది. పాకిస్తాన్ లో హిందువులు ఎక్కువగా సింద్ రాష్ట్రంలో ఉన్నారు. రాజధాని కరాచి నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా హిందువులు ఉన్నారు. కొన్ని నెలల క్రితం జరిగిన దీపావళి వేడుకల్లో అన్ని మతాల వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్  ప్రభుత్వం దేశంలో అన్ని మతాలని సమానంగా ఆడరిస్తామని ప్రకటించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే వరుస దాడులు జరగటం పాక్ లోని హిందూ సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.

Also Read : పాకిస్తాన్‌లో ద్రవ్యోల్భణం

RELATED ARTICLES

Most Popular

న్యూస్