Monday, June 15, 2026
HomeTrending Newsఅనురాగ్, ధర్మేంద్ర ప్రదాన్ లతో సిఎం భేటి

అనురాగ్, ధర్మేంద్ర ప్రదాన్ లతో సిఎం భేటి

CM Jagan Delhi tour: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రెండోరోజు పర్యటనలో పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అయ్యారు. ఉదయం కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన సిఎం ఆ తర్వాత కేంద్ర సమాచార ప్రసార;  క్రీడా శాఖల మంత్రి  అనురాగ్ సింగ్ ఠాకూర్, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ లను కలుసుకున్నారు. అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌తో సుమారు అరగంట పాటు జరిగిన సమావేశంలో ఏపీలో క్రీడా మైదానాల అభివృద్ధి సహా పలు అంశాలపై సిఎం జగన్‌ చర్చించారు.

ధర్మేంద్ర ప్రధాన్‌తో సుమారు 45 నిమిషాల పాటు సిఎం జగన్ భేటీ కొనసాగింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్య, నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్రమంత్రితో సీఎం వైయస్‌ జగన్‌ చర్చించారు.

Also Read : పోలీసులు చట్టానికి లోబడి పని చేయాలి – బిజెపి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular