Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్Badminton: Australian Open: ప్రణయ్ రన్నరప్

Badminton: Australian Open: ప్రణయ్ రన్నరప్

సిడ్నీ వేదికగా జరుగుతోన్న బ్యాడ్మింటన్ ఆస్ట్రేలియన్ ఓపెన్-2023, పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ హెచ్ ఎస్ ప్రణయ్  రన్నరప్ గా నిలిచాడు. ఈరోజు జరిగిన  ఫైనల్స్ లో  చైనా ప్లేయర్ వెంగ్ హాంగ్ యంగ్ 21-9; 23-21; 22-20 తో  ప్రణయ్ పై విజయం సాధించాడు.

మొదటి సెట్ ను భారీ తేడాతో కోల్పోయిన ప్రణయ్ రెండో సెట్ లో మెరుగైన ఆట తీరు ప్రదర్శించి హోరాహోరీగా తలపడి 23-21తో సెట్ గెల్చుకున్నాడు. మూడో సెట్ కూడా నువ్వా-నేనా అన్న రీతిలో సాగించి చివరకు విజయం వెంగ్ హాంగ్ నే వరించింది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్