టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. బస్ భవన్ లో సోమవారం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ రెడ్డి, మంత్రి ప్రశాంత్ రెడ్డి , ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి , గణేష్ గుప్తా , ముఠా గోపాల్, ఎమ్మెల్సీ విజీ గౌడ్ , మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత , నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ విఠల్ రావు పాల్గోన్నారు