Tuesday, March 10, 2026
HomeTrending Newsబజరంగ్ పునియాకు కాంస్యం

బజరంగ్ పునియాకు కాంస్యం

టోక్యో ఒలింపిక్స్ 57 కిలోల రెజ్లింగ్ లో భారత రెజ్లర్ భజరంగ్ పునియా కాంస్య పతకం సాధించాడు. ఈరోజు జరిగిన పోరులో కజకిస్తాన్ కు చెందిన నియాజ్ బెకోవ్ డాలెట్ పై 8-0  తేడాతో విజయం సాధించాడు. పునియా నిన్న జరిగిన సెమీస్ లో అజెర్ బైజాన్ దేశానికి చెందినా హాజీ అలియెవ్ చేతిలో 12-5తేడాతో ఓటమి  పాలైన సంగతి తెలిసిందే. అంతకుముందు క్వార్టర్  ఫైనల్ మ్యాచ్ లో ఇరాన్ కు చెందిన మోర్తెజాపై 2-1 తో విజయం సాధించాడు.

పునియాకు లభించిన కాంస్య పతకంతో టోక్యో ఒలింపిక్స్ లో ఇండియాకు మొత్తం ఆరు పతకాలు లభించాయి, వీటిలో 2 రజత (మీరాబాయి చాను, రవి కుమార్ దహియా) ; 4 కాంస్య (పి.వి. సింధు, లవ్లీనా, పురుషుల హాకీ, బజరంగ్) పతకాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular