తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు నియామకం. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. సుదీర్ఘ కాలంగా తెలుగుదేశం పార్టీకి నర్సింలు సేవలు అందిస్తున్నారు. 1994 నుంచి 1997 వరకు నర్సింలు షాద్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో వరుస పరాజయాలు పొందారు.
వివాదరహితుడైన నర్సింలు తెలుగుదేశం పార్టీ నేతగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సుపరిచితుడు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ సభ్యుడిగా ఉన్నారు.