Wednesday, May 29, 2024
Homeసినిమాఅనిల్ ని వెయిటింగ్ లో పెట్టిన బాలయ్య

అనిల్ ని వెయిటింగ్ లో పెట్టిన బాలయ్య

బాలకృష్ణ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు ఆహా కోసం ‘అన్ స్టాపబుల్‘ అంటూ టాక్ షో చేస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన వీరసింహారెడ్డి టైటిల్ అంట్ మోషన్ పోస్టర్ కి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో మూవీ పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ భారీ, క్రేజీ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. సినిమా తర్వాత బాలయ్య  అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. ఈ సినిమా ఎప్పటి నుంచో వార్తల్లో ఉంది. ఇన్నాళ్లకు సెట్ అయ్యింది. ఈ మూవీకి ‘రామారావు గారు’ అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ మూవీని సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అయితే.. ఈ మూవీకి బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. వీర సింహారెడ్డి పూర్తవగానే అనిల్ రావిపూడి సినిమాని పట్టాలెక్కించాలనుకున్నారు బాలయ్య. కానీ వీరసింహారెడ్డి టీమ్ లో చాలా వరకు కరోనాతో ఎఫెక్ట్ అయ్యారు. మళ్లీ కోలుకుని షూటింగ్ ప్రారంభించినా మరోసారి కరోనా బారిన పడటంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

ఇప్పటికీ కొంత మేజర్ పార్ట్ షూటింగ్ పెండింగ్ లో వుందట. అది పూర్తి కావాలంటే మరో నెల రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. ఆ కారణంగానే అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని డిసెంబర్ లో బాలయ్య కొంత విశ్రాంతి తీసుకోవాలి. ఆ తరువాతే అనిల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అంటే.. డిసెంబర్ కాకుండా వచ్చే ఏడాదిలోనే ఈ మూవీని స్టార్ట్ చేద్దామని.. అంత వరకు వేచి వుండమని హీరో బాలయ్య దర్శకుడు అనిల్ కి చెప్పినట్టు సమాచారం

RELATED ARTICLES

Most Popular

న్యూస్