Saturday, January 18, 2025
HomeTrending Newsబాలా సాహెబ్ శివసేన..పేరుతో షిండే కొత్త పార్టీ

బాలా సాహెబ్ శివసేన..పేరుతో షిండే కొత్త పార్టీ

మహారాష్ట్రలో శివసేన పార్టీలో తలెత్తిన తిరుగుబాటు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో రెబెల్ ఎమ్మెల్యేలను ఎక్కువ రోజులు క్యాంపులో ఉంచడం సాధ్యం కాదని భావిస్తున్న వారి నేత ఏక్ నాథ్ షిండే ముంబయికి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అంతే కాదు రెబెల్స్ తో కలిసి కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్దమయ్యారు. ‘బాలా సాహెబ్ శివసేన’పేరుతో పార్టీ ఏర్పాటు చేసి దిశగా సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో తనతోపాటు కలిసి వచ్చిన శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో షిండే చర్చలు జరుపుతున్నారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే కంటే ఎక్కువగా ఎమ్మెల్యేల మద్దతు ఉండి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటుకు షిండే ముందు అడుగు వేయలేదు. దీన్ని బట్టి చూస్తే కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 50మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండి కూడా ప్రభుత్వ ఏర్పాటుగా షిండే ప్రయత్నించలేదు.

ప్రస్తుతం అస్సోంలోని గౌహతిలో ఉన్న ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని రెబెల్ ఎమ్మెల్యేలు త్వరలో ముంబైకి తిరిగి రానున్నారు. అదే సమయంలో ముంబైలో అడుగుపెట్టాక కొత్త పార్టీ ప్రకటించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. శివసేన(బాలాసాహెబ్) పేరుతో కొత్త పార్టీ పెట్టాలని వారు భావిస్తున్నారు. ఈ విషయాన్ని రెబెల్ క్యాంపులో ఎమ్మెల్యే దీపక్ కేసర్కార్ ప్రకటించారు. ఇప్పటికీ శివసేన సిద్ధాంతాలతో, బాల్ థాక్రే భావజాలంతో తాము వేరు కాలేదని చెప్తున్న ఏక్ నాథ్ షిండే వర్గం తమదే అసలైన శివసేనగా ప్రకటించుకుంటున్నారు. అయితే దానికి బదులుగా కొత్త పార్టీ ఏర్పాటుకు వారు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మహావికాస్ అఘాడీ సర్కార్ లో భాగస్వాములుగా ఉన్న ఎన్సీపీ, కాంగ్రెస్ తో వేరుపడేందుకు ఉద్ధవ్ థాక్రే సిద్ధం కాకపోవడంతో తామే వేరే పార్టీ పెట్టుకుని బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రెబెల్ ఎమ్మెల్యేల నేత ఏక్ నాథ్ షిండే సిద్దమవుతున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్