Thursday, March 19, 2026
Homeసినిమావిలేజ్ నేపథ్యంలోనే నానీ నెక్స్ట్ మూవీ!

విలేజ్ నేపథ్యంలోనే నానీ నెక్స్ట్ మూవీ!

మొదటి నుంచి కూడా నానీ భిన్నమైన కథలను .. పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. శ్యామ్ సింగరాయ్ .. దసరా .. హాయ్ నాన్న వంటి సినిమాల నుంచి ఆయన లుక్ పరంగా కూడా కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాడు. త్వరలో ఆయన నుంచి ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘సరిపోదా శనివారం’ ముస్తాబవుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా అలరించనుంది.

ఈ సినిమా తరువాత నాని రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టినట్టుగా తెలుస్తోంది. అందులో ఒక సినిమాకి ‘బలగం’ వేణు దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కథ కూడా విలేజ్ నేపథ్యంలోనే నడుస్తుందనే టాక్ తాజాగా వినిపిస్తోంది. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా ఈ కథ అలరిస్తుందని చెబుతున్నారు. పాత్రకి తగినట్టుగా నాని లుక్ కూడా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. ఇంతవరకూ ఇలాంటి ఒక పాత్రను నాని చేయలేదట.

‘బలగం’ సినిమా ఏ స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ అయిందనేది అందరికీ తెలిసిన విషయమే. గ్రామీణ ప్రజలు .. అక్కడి జీవన విధానం .. అక్కడి మనుషుల్లోని ఎమోషన్స్ ఎలా ఉంటాయనే విషయంపై వేణుకి మంచి అవగాహన ఉందనే విషయం అందరికీ అర్థమైపోయింది. నానీతో చేయనున్న సినిమా కూడా విలేజ్ నేపథ్యానికి సంబంధించినదే అయితే, అక్కడే వేణుకి సగం మార్కులు పడిపోతాయి. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular