Saturday, June 13, 2026
Homeసినిమా'ఆహా'లో అడుగుపెట్టిన 'భామాకలాపం 2'

‘ఆహా’లో అడుగుపెట్టిన ‘భామాకలాపం 2’

ప్రియమణి ప్రధానమైన పాత్రను పోషించిన ‘భామాకలాపం’ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అభిమన్యు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సీక్వెల్ గా ‘భామాకలాపం 2’ సినిమా రూపొందింది. ఫస్టు పార్టుకి వచ్చిన రెస్పాన్స్ కారణంగా, సహజంగానే ఈ సినిమా పట్ల ఆడియన్స్ ఆసక్తితో ఉన్నారు. అందునా చాలా రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ ఒక రేంజ్ లో కొనసాగుతున్నాయి. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచే ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సినిమాలో ప్రియమణి ‘అనుపమ’ అనే పాత్రను పోషించింది. ఫస్ట్ పార్టు వరకూ చూస్తే, ఆమె ఓ  మధ్యతరగతి ఇల్లాలు. ఓ అపార్టుమెంటులోని ఫ్లాటులో ఆమె ఫ్యామిలీ ఉంటూ ఉంటుంది. వంటల ప్రోగ్రామ్ తో సొంత యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ, అక్కడ కాస్త పాప్యులర్ అవుతుంది. అయితే ఎవరెవరు ఏం చేస్తున్నారు? ఎవరెవరి కుటుంబాలలో ఎలాంటి గొడవలు ఉన్నాయనేది తెలుసు కోవడం పట్ల ఆమెకి ఇంట్రెస్ట్ ఎక్కువ. అలా ఒక ఫ్యామిలీలో ఏం జరుగుతుందనేది తెలుసుకోబోయి, ఓ మర్డర్ కేసులో చిక్కుకుంటుంది.

శవాన్ని మాయం చేయడానికి పనిమనిషి శిల్ప  సాయం తీసుకుంటుంది. అయితే ఆమె మర్డర్ చేసిన విషయం ఒక పోలీస్ తో పాటు, గ్యాంగ్ స్టర్ కి కూడా తెలిసిపోతుంది. ఆ మర్డర్ కేసు నుంచి .. వాళ్ల నుంచి ఆమె ఎలా బయటపడుతుందనే ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ కథ నడుస్తుంది. అపార్టుమెంటులోనివారు ఆమె ధోరణి పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేయడంతో, అనుపమ ఫ్యామిలీ మరో చోటుకి మారిపోతుంది. అక్కడ ఏం జరుగుతుందనేదే పార్టు 2లో కనిపించే కథనం. చూడాలి మరి సెకండ్ పార్టు ఏ రేంజ్ లో ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular