Wednesday, June 17, 2026
Homeసినిమాబాలయ్య, బి.గోపాల్ కాంబో నిజంగా ఫిక్స్ అయ్యిందా.. ?

బాలయ్య, బి.గోపాల్ కాంబో నిజంగా ఫిక్స్ అయ్యిందా.. ?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘భగవంత్ కేసరి’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీ టీజర్ ను ఇటీవల బాలయ్య పుట్టినరోజుకు రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అయితే.. ఈ సినిమా తర్వాత బాలయ్య డైరెక్టర్ బాబీతో సినిమా చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాని ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురానున్నారు.

ఇదిలా ఉంటే.. సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ ఈమధ్య యూట్యూబ్ ఇంటర్ వ్యూలో నెక్ట్స్ మూవీ ఎవరితో చేయనున్నారు అంటే.. బాలయ్యతో సినిమా తీసి రిటైర్ అయిపోతాను అని చెప్పారు. తిరుమల వెళ్లి ఆ వెంకటేశ్వరుని దర్శించుకున్నారు బి.గోపాల్. అక్కడ మీడియా అడిగినా కూడా ఇదే చెప్పారు. బాలయ్యతో సినిమా తీసి రిటైర్ అయిపోతాను అని. ఎప్పుడు చేస్తారంటే.. బాలయ్య ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు చేస్తాను అన్నారు. కథ రెడీగా ఉందా అంటే.. ప్రస్తుతం కథను రెడీ చేస్తున్నాం. ఈ కథ బిగినింగ్ లో ఉంది. కథ రెడీ అయిన తర్వాత బాలయ్యకు వినిపిస్తాం అన్నారు.

బాలయ్య, బి.గోపాల్ ఇద్దరిదీ సన్సేషనల్ కాంబినేషన్. ‘లారీ డ్రైవర్’, ‘రౌడీ ఇన్ స్పెక్టర్’, ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహానాయుడు’ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ సాధించారు. పల్నాటి బ్రహ్మానాయుడు తర్వాత బాలయ్యతో మళ్లీ బి.గోపాల్ సినిమా చేయలేదు. అలా దాదాపు 20 ఏళ్లు గ్యాప్ వచ్చింది. బాలయ్య కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. ప్రస్తుతం భగవంత్ కేసరి చేస్తున్న బాలయ్య ఆతర్వాత బాబీతో సినిమా చేయనున్నారు. ఆతర్వాత లిస్ట్ లో పూరి జగన్నాథ్ ఉన్నారు. అలాగే ఎస్వీ కృష్ణారెడ్డి కూడా బాలయ్య కోసం వెయిట్ చేస్తున్నారు. మరి.. బి.గోపాల్ కి బాలయ్య ఎప్పుడు అవకాశం ఇస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular