Wednesday, June 17, 2026
Homeసినిమాబాలయ్య మూవీ ఇంట్రస్టింగ్ అప్ డేట్

బాలయ్య మూవీ ఇంట్రస్టింగ్ అప్ డేట్

బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో 100 సినిమాలు పూర్తి చేసిన తర్వాత మరింత స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించాడు. ఇప్పుడు ‘భగవంత్ కేసరి’ అంటూ భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దసరాకి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

భగవంత్ కేసరి తర్వాత సినిమాను బాలయ్య.. బాబీ డైరెక్షన్ లో మూవీ చేయనున్నట్టుగా ఇటీవల ప్రకటించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి షెడ్యూల్ ను సారధి స్టూడియోలో ప్లాన్ చేశారు. అక్కడ వేసిన భారీ సెట్టింగ్ లో యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ సీన్స్ కోసం పెద్ద ఎత్తున ఫైటర్స్ ను రంగంలోకి దించుతున్నారని తెలిసింది. ఎప్పుడు ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసేది త్వరలో ప్రకటించనున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఏంటంటే.. ఈ సినిమా రాజకీయ నేపధ్యంలో ఉంటుందని.. ముఖ్యంగా ఏపీలోని రాజకీయ పరిస్థితులు ఆధారంగా ఈ సినిమా చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. పైగా ఈ రాజకీయ చిత్రాన్ని 2024 ఎన్నికల ముoదు రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. మరో విషయం ఏంటంటే.. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని.. తండ్రీకొడుకులగా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బాలయ్య ఓల్డ్ గెటప్ ఓ రేంజ్ లో ఉంటుందని టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular