Saturday, January 18, 2025
Homeసినిమాబాలయ్య సర్ ఫ్రైజ్ ఇదే....

బాలయ్య సర్ ఫ్రైజ్ ఇదే….

నందమూరి నటసింహం బాలకృష్ణ.. తండ్రి ఎన్టీఆర్ జయంతి రోజున ఓ సర్ ఫ్రైజ్ ఉంటుందని నిన్న ప్రకటించారు. దీంతో బాలయ్య అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా ఏంటా సర్ ఫ్రైజ్ అంటూ ఆలోచనలో పడ్డారు. కొత్త సినిమాను ఎనౌన్స్ చేస్తారా.? లేక మరేదైనానా..? అనుకున్నారు. ఆఖరికి ఈ రోజు ఉదయం 8.45 నిమిషాలకు సర్ ఫ్రైజ్ రివీల్ చేశారు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా బాల‌య్య నుంచి శ్రీ‌రామ దండ‌కం రాబోతోంది. రేపు ఉద‌యం స‌రిగ్గా 9 గంట‌ల 45 నిమిషాల‌కు ఈ దండ‌కం విడుద‌ల చేస్తారు.

బాలయ్యకు పాటలు పాడడం అంటే మహా సరదా. పైసా వసూలు సినిమాలో మామా ఏక్ పెగ్ లా అంటూ పాడి ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నారు. సినిమాలోనే కాకుండా.. మేము సైతం పొగ్రాంలో స్టేజీ పై పాట పాడి అలరించారు. అంతే కాకుండా.. ఆమధ్య శివ శంకరీ.. పాట పాడి అందరికీ బిగ్ సర్ ఫ్రైజే ఇచ్చారు. ఈ పాటకు చాలా విమర్శలు వచ్చాయి. అయినా.. బాలయ్య వాటిని ఏం పట్టించుకోకుండా ఇప్పుడు శ్రీరామ దండకం పాడేశారు. మరి.. బాలయ్య పాడిన ఈ పాటకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్