Sunday, June 7, 2026
Homeసినిమానందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రం ప్రారంభం

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రం ప్రారంభం

#NBK107 Launched:
నటసింహా నందమూరి బాలకృష్ణ – మలినేని గోపీచంద్  కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తూ  #NBK107 అంటూ వర్కింగ్ టైటిల్‌‌తో రూపొందుతోన్న సినిమా ప్రారంభోత్సవం నేడు హైద్రాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి వివి వినాయక్ క్లాప్ కొట్టగా.. బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి సన్నివేశానికి హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు సానా స్క్రిప్ట్‌ను మేకర్లకు అందజేశారు. బాలయ్య సరసన హీరోయిన్‌గా శ్రుతీ హాసన్‌ నటిస్తోంది.

నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. సాంకేతిక పరంగా ఈ చిత్రం ఉన్నతంగా ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం గోపీచంద్ మలినేని ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. రిషి పంజాబీ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బాలకృష్ణకు తగ్గట్టుగా పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌ లను రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేయనున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి ప్రారంభం కానుంది.

Also read : నవంబర్ 13న బాలకృష్ణ కొత్త‌ చిత్రం ప్రారంభం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular