బాలయ్య నెక్ట్స్ ఏంటి.?

బాలకృష్ణ ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం అనిల్ రావిపూడితో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయ్యింది. త్వరలో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఇందులో బాలకృష్ణకు కూతురుగా శ్రీలీల నటిస్తుండడం విశేషం. ఇప్పటి వరకు ఫ్లాప్ అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తున్న అనిల్ రావిపూడి బాలయ్యతో సినిమా చేస్తుండడంతో ఈ మూవీ కూడా విజయం సాధించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.

అయితే.. ఈ మూవీ తర్వాత బాలయ్య నెక్ట్స్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన మల్లిడి వశిష్ట దర్శకత్వంలో బాలకృష్ణ ఒక మైథలాజికల్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో మూవీ చేయడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. వీరిద్దరూ లైన్ లో ఉండగానే ప్రశాంత్ వర్మ చెప్పిన ఒక ఇంటరెస్టింగ్ స్టొరీకి కూడా బాలయ్య ఒకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అన్ స్టాపబుల్ షోకి ప్రశాంత్ వర్మ దర్శకుడిగా ఉన్నాడు. ఈ నేపధ్యంలోనే బాలయ్యకి ప్రశాంత్ స్టొరీ నేరేట్ చేసినట్లు సమాచారం. అలాగే వాల్తేర్ వీరయ్యతో సూపర్ సక్సెస్ అందుకున్న బాబీ కూడా బాలకృష్ణతో ఒక సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నట్లుగా టాక్.

అలాగే పూరి జగన్నాథ్ కూడా బాలయ్య కోసం కథ రెడీ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి పైసా వసూల్ మూవీ చేశారు. మళ్లీ ఇప్పుడు మరో సినిమా చేయాలి అనుకుంటున్నారు. దీంతో అనిల్ రావిపూడి తర్వాత బాలయ్య ఎవరితో మూవీ చేయనున్నారు అనేది ఆసక్తిగా మారింది. వీళ్లు మాత్రమే కాకుండా మరల గోపీచంద్ మలినేని, శ్రీవాస్ దర్శకత్వంలో కూడా సినిమాలు చేయడానికి బాలయ్య ఒకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. బాలయ్య 100 సినిమాలు పూర్తి చేసిన తర్వాత స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు. మరి.. బాలయ్య ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి.

Also Read : బాలయ్య జోడీగా మరోసారి సందడి చేయనున్న హనీ రోజ్? 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *