Tuesday, September 17, 2024
Homeసినిమామరోసారి బాలయ్య కృష్ణావతారం!

మరోసారి బాలయ్య కృష్ణావతారం!

తెలుగు తెరపై శ్రీరాముడుగా .. శ్రీకృష్ణుడుగా రామారావు ఒక తిరుగులేని ముద్ర వేశారు. ఆ తరువాత ఆ పాత్రలను పోషించడానికి ఎవరూ సాహసించలేదు. ఈ రెండు పాత్రలలోను బాలకృష్ణ మెప్పించారు. అలాంటి ఒక కనుముక్కుతీరు బాలయ్య సొంతం. మళ్లీ ఇప్పుడు బాలయ్య కృష్ణుడిగా కనిపించనున్నట్టుగా ఒక ప్రచారం జోరందుకుంది. అయితే ఈ సినిమాలో కథానాయకుడు ఆయన కాదు, ఆయన తనయుడు మోక్షజ్ఞ అనేదే ఆసక్తిని రేకెత్తించే అంశం.

మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా ఈ నెల 6వ తేదీన పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. ఆ రోజున మోక్షజ్ఞ పుట్టినరోజు కావడం వలన అలా సెట్ చేశారు. ఈ కథ పౌరాణిక కాలాన్ని టచ్ చేస్తుంది. అందువలన ఆ ట్రాకు వైపున కృష్ణావతారం తెరపైకి వస్తుంది. ఆ పాత్రలో  బాలకృష్ణ కనిపించనున్నాడని అంటున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు హైలైట్ గా ఉంటాయని చెబుతున్నారు.

తెరపై పౌరాణిక పాత్రలలో బాలయ్య కనిపించి చాలా కాలమే అయింది. ఆయనను పౌరాణిక పాత్రలో మరోసారి చూడాలనుకునేవారి ముచ్చట ఇలా తీరుతుందని చెప్పుకోవచ్చు. బాలయ్య ఈ సినిమాలో చేయనుండటం .. అందునా శ్రీకృష్ణుడిగా కనిపించనుండటం ఈ ప్రాజెక్టు క్రేజ్ ను మరింత పెంచుతుందని చెప్పచ్చు. మోక్షజ్ఞ జోడిగా ఈ సినిమాలో ఖుషీ కపూర్ కనిపించనుందనే టాక్ బలంగా వినిస్తోంది. ఈ నెల 6వ తేదీన ఒక క్లారిటీ రానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్