Saturday, June 13, 2026
Homeసినిమాఅక్కినేని వివాదం పై స్పందించిన బాలయ్య

అక్కినేని వివాదం పై స్పందించిన బాలయ్య

బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో బాలకృష్ణ ఏదో మాట్లాడుతూ… ఈ రంగారావు.. ఆ రంగారావు .. అక్కినేని.. తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడం తెలిసిందే. అక్కినేని నాగచైతన్య, అఖిల్ తో పాటు అక్కినేని అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు మూడు రోజులుగా బాలయ్య వ్యాఖ్యల పై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో పలువురు కాపు సంఘాలు కూడా బాలయ్య ఎట్టిపరిస్థితుల్లోనూ అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ వివాదం పై తాజాగా బాలకృష్ణ స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావును కించ పరుస్తూ తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన చేసిన వ్యాఖ్యలు ఏదో ఫ్లోలో వచ్చాయని క్లారిటీ ఇచ్చారు. హిందూ పురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాలకృష్ణ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా అక్కినేని నాగేశ్వరరావు తన పై తన పిల్లలకంటే ఎక్కువగా ప్రేమ చేపేవారన్నారు. తాను బాబాయ్ అని పిలుచుకునే వాడినని.. ఆయన పై ప్రేమ తనకు గుండెల్లో వుంటుందన్నారు. క్రమశిక్షణ నాన్న గారి నుంచి నేర్చుకున్నాను.. పొగడ్తలకు పొంగిపోకూడదనే విషయాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారి నుంచే నేర్చుకున్నాను అన్నారు.

ఒక్కో ప్రాంతంలో ఒక్కో యాసలో పిలుస్తుంటారని అదంతా ఆయన పై వారు చూపే అభిమానమేనని.. ఎన్టీఆర్ జాతీయ అవార్డ్ ను ఏర్పాటు చేసి తొలి అవార్డ్ ను అక్కినేని నాగేశ్వరరావు గారికే ఇచ్చామన్నారు. సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఏఎన్నార్ రెండు కళ్లలాంటి వాళ్లని.. నేను ఏదో ఫ్లోలో అన్న వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదన్నారు.

Also Read : నాగ్ స్పందించకపోవడానికి కారణం..? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular