Thursday, March 28, 2024
Homeసినిమాబాలయ్య వెబ్ సిరీస్ లో నటించనున్నాడా.?

బాలయ్య వెబ్ సిరీస్ లో నటించనున్నాడా.?

బాలకృష్ణ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరో వైపు ‘అన్ స్టాపబుల్’ అంటూ టాక్ షో చేస్తున్నారు. ఆహా కోసం బాలయ్య చేస్తున్నటాక్ షో అనూహ్య స్పందన వచ్చింది. ఫస్ట్ సీజన్ కంటే సెకండ్ సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌, ప్రభాస్.. ఇలా హేమాహేమీలను బాలయ్య తనదైన స్టైల్ లో ఇంటర్ వ్యూ చేయడం విశేషం. ఈ షోతో అటు ఆహాకు, ఇటు బాలయ్యకు మరింత క్రేజ్ పెరిగిందని చెప్పచ్చు. దీంతో అన్ స్టాపబుల్ టాక్ షో సెకండ్ సీజన్ లో గెస్ట్ లు ఇంకా ఎవరు రానున్నారు..? సీజన్ త్రి ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది.

ఇదిలా ఉంటే.. ఇటీవల ‘వీరసింహారెడ్డి‘ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన 50 రోజులు సక్సెస్ ఫుల్ కంప్లీట్ చేసుకుంది. 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాలయ్య కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇక అసలు విషయానికి వస్తే.. బాలయ్య ఓ వెబ్ సిరీస్ లో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయనతో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తుంది ఎవరో కాదు..అల్లు అరవింద్ అని సమాచారం. ఇప్పటికే టాలీవుడ్ నుండి సమంత ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ లో నటించింది. మరో వెబ్ సిరీస్ చేస్తోంది. నాగ చైతన్య ‘దూత’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఇక వెంకటేష్‌, రానా దగ్గుబాటి కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ లో నటించారు. అది విడుదల సిద్ధంగా ఉంది.

ఇప్పుడు బాలయ్యతో వెబ్ సిరీస్ నిర్మించాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తుండడం విశేషం. వెబ్ సిరీస్ కు బాలయ్య బాబు ఒప్పుకుంటే టాలీవుడ్ లో ఇదో టర్నింగ్ పాయింట్ లా మారనుందని చెప్పచ్చు. బాలయ్యతో వెబ్ సిరీస్ అంటే అది ఎలా ఉండబోతుంది..? దీనిని ఎవరు డైరెక్ట్ చేస్తారు..? అల్లు అరవింద్ ప్రపోజల్ కు బాలయ్య బాబు ఒప్పుకుంటాడా లేదా..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. బాలయ్య వెబ్ సిరీస్ పై మరింతగా క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్