Friday, June 12, 2026
Homeసినిమాబాలయ్య 110 ఎవరితో..?

బాలయ్య 110 ఎవరితో..?

బాలకృష్ణ ప్రస్తుతం 107 మూవీ ‘వీరసింహారెడ్డి‘ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. సంక్రాంతికి మూవీ విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య 108 మూవీ అనిల్ రావిపూడితో చేయనున్నారు. డిసెంబర్ లో ఈ సినిమాని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బాలయ్యను ఇప్పటి వరకు చూపించని విధంగా సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇందులో బాలయ్యకు జంటగా బాలీవుడ్ హీరోయిన్ నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. అయితే.. బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తుంది.

ఇదిలా ఉంటే.. బాలయ్య 110 సినిమా విషయంలో ఉత్కంఠ ఏర్పడింది. కారణం ఏంటంటే… ఇప్పటికే ‘ఆదిత్య 369’ కీ సీక్వెల్ గా ‘ఆదిత్య 999’ కథని స్వయంగా బాలయ్యే సిద్దం చేసారు. సింగీతం శ్రీనివాసరావు కూడా ఆదిత్య 999 మూవీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని.. ఈ సినిమా చేసి ఇక సినిమాలకు గుడ్ బై చెబుతానని ఆయన చెప్పారు. ఈ సినిమాకి డైరెక్షన్ చేసే ఛాన్స్ సింగీతంకు అప్పగిస్తారా..? బాలయ్యే చేస్తారా..? అన్నది  క్లారిటీ లేదు. ఈ ప్రాజెక్ట్  110వ సినిమా రేసులో ఉంది.

అలాగే ‘అఖండ’ బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో బోయపాటి పై నమ్మకంతో ఆ ల్యాండ్ మార్క్ మూవీ బాధ్యతలు అతనికి అప్పగించడానికి అవకాశం ఉందని బలంగా వినిపిస్తుంది. ‘అఖండ 2’ కూడా ఉంటుందని ఇటీవల బాలయ్య, బోయపాటి కలిసి గోవాలో మీడియాకు తెలియచేశారు. దీంతో ‘బాలయ్య 110’ మూవీ ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 అవుతుందా..? అఖండ సీక్వెల్ అఖండ 2 అవుతుందా..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. బాలయ్య 110వ సినిమా విషయంలో క్లారిటీ రావాలటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : వీరయ్య, వీరసింహారెడ్డి రిలీజ్ డేట్స్ ఇవే. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular