Sunday, January 19, 2025
Homeసినిమారెండో హ్యాట్రిక్ కు రెడీ అవుతోన్న బాలయ్య-బోయపాటి

రెండో హ్యాట్రిక్ కు రెడీ అవుతోన్న బాలయ్య-బోయపాటి

Again: న‌ట సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన సింహ‌, లెజెండ్ చిత్రాలు ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించాయో తెలిసిందే.  వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రూపొంది ఇటీవల విడుదలైన ‘అఖండ’బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి హ్యాట్రిక్ సాధించింది. బాల‌య్య కెరీర్ లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. బాల‌య్య అయితే.. ఈ సినిమాలో మ‌రోసారి న‌ట విశ్వ‌రూపం చూపించారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు బాల‌య్య‌, బోయ‌పాటి క‌లిసి మ‌రో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ విష‌యం ఏంటంటే… బాలకృష్ణ కోసం ఫక్కా పొలిటికల్ స్టోరీను బోయపాటి రెడీ చేస్తున్నారట‌. అనిల్ రావిపూడి బాలయ్య సినిమా తర్వాత‌ అంటే వచ్చే ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూట్ ప్రారంభం అయ్యే అవకాశం వుందని టాక్ వినిపిస్తోంది. ఆంధ్రలో ఎన్నికల మూడ్ ను బట్టి ఈ సినిమా కాస్త ముందుకు వెనక్కు వెళ్తుందని స‌మాచారం.

బాలయ్య నోట పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగులు వుంటాయని టాక్. పొలిటికల్ అంశాలను తెలివిగా కథలో చొప్పించడంలో బోయపాటికి చాలా టాలెంట్ వుంది. సింహా..లెజెండ్, అఖండ సినిమాలు స‌క్సెస్ అయిన నేపథ్యంలో అదే కాంబినేషన్ లో సినిమా అంటే.. ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో తెలిసిందే. మ‌రి.. బాల‌య్య‌, బోయ‌పాటి ఈ పొలిటిక‌ల్ ఫిల్మ్ తో ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Also Read : ఆ వార్త‌ల్లో వాస్త‌వం లేదు : బాల‌కృష్ణ‌ టీమ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్