నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ చిత్రాలు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ క్రేజీ కలయికలో మరో సినిమా వస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే బాలయ్య, బోయపాటి కూడా మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్.బి.కే 108 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అనిల్ రావిపూడితో తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రాన్ని దసరాకి  విడుదల చేయనున్నారు.

దీని తర్వాత బాలయ్య, బోయపాటితో సినిమా చేయనున్నాడని.. అది అఖండ సీక్వెల్ అఖండ 2 అని వార్తలు వచ్చాయి కానీ..  తాజాగా అందుతున్న సమాచారం మేరకు అది అఖండ 2 కాదట.. లెజెండ్ 2 అట. కారణం ఏంటంటే.. లెజెండ్ లో పొలిటికల్ టచ్ ఉంటుంది. ఈ సినిమా చేస్తే.. 2024 ఎన్నికలకు ఉపయోగపడేలా పొలిటికల్ డైలాగ్స్ పెట్టచ్చు. ఇది బాలకృష్ణకు ఉపయోగ పడుతుంది. అందుకనే ‘అఖండ 2’ ను పక్కనపెట్టి లెజెండ్ సీక్వెల్ తీయాలని డిసైడ్ అయ్యారని సమాచారం. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి బాలయ్య అభిమానులు అఫిషియల్ అనౌన్స్ మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు.

జూన్ 10న బాలయ్య పుట్టినరోజు. ఆ రోజున ఈ చిత్రాన్ని అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. మరో వైపు అనిల్ రావిపూడితో చేస్తున్న మూవీ టైటిల్ కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఈ సంవత్సరం బాలయ్య పుట్టినరోజు అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారని తెలిసింది. అంతా అనుకున్నట్టుగా జరిగి లెజెండ్ సీక్వెల్ తీస్తే.. నందమూరి అభిమానులకు పండగే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *