Sunday, January 19, 2025
Homeసినిమా'బింబిసార-2' లో బాల‌య్య?

‘బింబిసార-2’ లో బాల‌య్య?

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార‌’. వ‌శిష్ట్ డైరెక్ట‌ర్ గా పరిచయం అవుతూ రూపొందించిన ఈ సినిమా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించి  అంచ‌నాల‌కు మించి స‌క్సెస్ సాధించింది. క‌ళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం బింబిసార రికార్డు క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతుంది. ఈ మూవీకి పార్ట్ 2 ఉంటుంద‌ని రిలీజ్ కి ముందే చెప్పారు మేక‌ర్స్.

ఇప్పుడు బింబిసార 2 పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. మరో వైపు బింబిసార సినిమాను చూసిన బాలకృష్ణ మాట్లాడుతూ.. వశిష్ఠ్ పనితనం పై ప్రశంసలు కురిపించాడు. ఇదే సమయంలో తప్పకుండా కలిసి సినిమా చేద్దామని కూడా హామీ ఇచ్చారు. దాంతో ఇద్దరి కాంబోలో సినిమా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఒక వేళ బింబిసార సినిమా రెండవ పార్ట్ లో మంచి పాత్ర ఉంటే తప్పకుండా బాలయ్య నటించే అవకాశం ఉంది.

బాల‌య్య‌, కళ్యాణ్ రామ్ కలిసి నటించాలని అభిమానులు ఎప్ప‌టి నుంచో కోరుకుంటున్నారు. కనుక బింబిసార 2 సినిమాను ఖచ్చితంగా నందమూరి అభిమానుల కోసం ఫ్యామిలీ మల్టీస్టారర్ గా మారిస్తే బాగుంటుందనే అభిప్రాయం ను వ్యక్తం చేస్తున్నారు. బాలయ్యకు బింబిసార కాన్సెప్ట్ నచ్చింది. కనుక సీక్వెల్ లేదా ప్రీక్వెల్ లో నటించేందుకు ఎలాంటి అడ్డంకి చెప్పక పోవ‌చ్చు. మ‌రి.. ప్రచారంలో ఉన్న‌ట్టుగా బింబిసార 2లో బాల‌య్య న‌టిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్