Thursday, March 28, 2024
Homeసినిమాఏప్రిల్ నుంచి షూటింగ్ షురూ...

ఏప్రిల్ నుంచి షూటింగ్ షురూ…

‘ఆర్ఆర్ఆర్’ లో కొమ‌రం భీమ్ గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌ట విశ్వ‌రూపం చూపించడంతో అయన తదుపరి సినిమాలపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆర్ఆర్ఆర్ ఓటీటీలో రిలీజ్ అయిన త‌ర్వాత హాలీవుడ్ సైతం ఎన్టీఆర్ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించ‌డం విశేషం. అంతే కాకుండా ఆస్కార్ బ‌రిలో కూడా ఎన్టీఆర్ నిలుస్తున్నారంటూ వార్త‌లు రావ‌డంతో ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీస్ పై అటు అభిమానుల్లోనూ,  ఇటు ఇండ‌స్ట్రీలోనూ మ‌రింత క్యూరియాసిటీ పెరిగింది.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ రెండు క్రేజీ ప్రాజెక్ట్ లని ప్రకటించారు. అందులో 30వ సినిమాగా కొరటాల శివతో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని చేయబోతున్నట్టుగా ఎన్టీఆర్ పుట్టిన రోజున  క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇంత వరకు ఈ మూవీ పట్టాలెక్కలేదు. న‌వంబ‌ర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఇదిలా వుంటే 31వ ప్రాజెక్ట్ గా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ ప్రాజెక్ట్ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ మూవీ అయినా ముందు స్టార్ట్ అవుతుందా? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ని అందించి ప్ర‌శాంత్ నీల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. ఇంత‌కీ ఏం చెప్పారంటే.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ని వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో స్టార్ట్ చేయబోతున్నట్టుగా వెల్లడించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల‌వుతున్నారు. ఎన్టీఆర్ ను ప‌వ‌ర్ ఫుల్ గా ఎలా చూపించ‌నున్నారో అనేది ఆస‌క్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్