Friday, March 29, 2024
Homeసినిమాబాల‌య్య వెర్సెస్ ప్ర‌భాస్. గెలిచేది ఎవ‌రు..?

బాల‌య్య వెర్సెస్ ప్ర‌భాస్. గెలిచేది ఎవ‌రు..?

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ డైరెక్ష‌న్ లో భారీ యాక్ష‌న్ మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో బాల‌య్య స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ క‌ర్నూలులో జరుగుతోంది. దీనికి  ‘జై బాల‌య్య‌’, ‘అన్నగారు’ అనే టైటిల్స్ ను ప‌రిశీలిస్తున్నారు. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌నున్నారు.

ఈ మూవీని డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. ఇక ప్ర‌భాస్ విష‌యానికి వ‌స్తే.. రామాయ‌ణం ఆధారంగా ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నారు.  బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓంరౌత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ రాముడుగా న‌టిస్తుంటే.. కృతిస‌న‌న్ సీత‌గా న‌టిస్తుంది. సైఫ్ ఆలీఖాన్ రావ‌ణుడుగా న‌టిస్తున్నారు. ఈ భారీ చిత్రం షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. ఇప్పుడు అదే డేట్ కి బాల‌య్య 107 మూవీ కూడా వ‌స్తుంద‌ని.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ బాల‌య్య‌, ప్ర‌భాస్ పోటీ అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. మ‌రి.. ఇదే క‌నుక జ‌రిగితే ఏ సినిమా భారీ విజయం సాధిస్తుందో చూడాలి.

Also Readఆదిపురుష్ 2 కూడా ఉంటుందా? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్