Sunday, January 19, 2025
HomeTrending Newsకంటోన్మెంట్ పాకిస్తాన్ లో ఉందా- బండి సంజయ్

కంటోన్మెంట్ పాకిస్తాన్ లో ఉందా- బండి సంజయ్

ముఖ్యమంత్రి కేసీఆర్ కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ‘‘కంటోన్మెంట్ ప్రజలు ఏమైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళా? రోడ్లు, డ్రైనేజీ సమస్యలతోపాటు ఆఖరుకు మంచి నీళ్ల లేక అల్లాడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు?’’ అని ప్రశ్నించారు. ‘‘కేంద్రం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా కంటోన్మెంట్ కు వర్తింపజేయడం లేదు. ఆ సంక్షేమ పథకాలను కంటోన్మెంట్ కు ఇవ్వకూడదని నీకేమైనా రాసిచ్చారా కేసీఆర్?’’అని నిలదీశారు. ఆర్మీ నుంచి కంటోన్మెంట్ కి రావలసిన రూ.700 కోట్ల నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా.. ముందు నువ్వు కంటోన్మెంట్ కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు’’అని సవాల్ విసిరారు. కంటోన్మెంట్తో నాకేంటి సంబంధం అంటున్న కేసీఆర్ కి ప్రజలే బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కుమార్ మారేడ్ పల్లిలోని డబుల్ బెడ్రూం హౌజింగ్ కాలనీ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

అందులోని ముఖ్యాంశాలు…

• ఈనెల 12న నాలుగో విడత “ప్రజా సంగ్రామ యాత్ర“ను ప్రారంభించాం. అన్ని బస్తీలు, కాలనీలు, డివిజన్లలో తిరుగుతూ…. ప్రజా సమస్యలను తెలుసుకుంటున్న. ప్రజా సమస్యలను తెలుసుకోడానికే… పాదయాత్ర చేయమని నన్ను మోదీ ఆదేశించారు. ప్రజలకు కేంద్రం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది.

• కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా… లేదా… అనేది తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తున్న. సంవత్సరం నుంచి కుటుంబాన్ని వదిలి, పాదయాత్ర చేస్తున్నాం. ఈనెల 22 వరకు 4వ విడత పాదయాత్ర చేస్తా. ప్రతినెల 20 రోజులపాటు పాదయాత్ర చేస్తా.

• జిహెచ్ఎంసి, కంటోన్మెంట్ లలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమ సమస్యలు, బాధలను చెప్పుకుంటున్నారు. కంటోన్మెంట్ ఏరియాలో జాగాలు కబ్జా చేయడానికి లేదు కాబట్టే, కంటోన్మెంట్ ఏరియా కేంద్రానిది… నాది కాదు అని కేసీఆర్ అంటున్నాడు.

• కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దల వద్ద వంగివంగి దండాలు పెడతాడు. మోడీ నిద్రాహారాలు మాని 18 గంటలు పనిచేస్తే… కెసిఆర్ 18 గంటలు పడుకుంటాడు. కంటోన్మెంట్ అభివృద్ధిని కేసీఆర్ పూర్తిగా వదిలేశాడు.

• రోడ్లు, డ్రైనేజీ సహా కనీస సౌకర్యాల్లేక జనం అల్లాడుతున్నరు. ఈ ప్రాంతానికి రోజూ 90 లక్షల గ్యాలన్ల మంచి నీళ్లు అవసరమైతే… అందులో సగం కూడా ఇవ్వడం లేదు. కంటోన్మెంట్ వాళ్లు ఏమైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళా కేసీఆర్? ఎందుకు కంటోన్మెంట్ వాళ్లకు నీళ్లు ఇవ్వడం లేదు?

• కేంద్రం ఇస్తున్న సంక్షేమ పథకాలను కంటోన్మెంట్ కు ఇవ్వకూడదని నీకు ఏమైనా రాసి ఇచ్చారా కేసీఆర్?. ఆర్మీ నుంచి కంటోన్మెంట్ కి రావలసిన డబ్బులు రప్పించే ప్రయత్నం చేస్తా. ముందు నువ్వు కంటోన్మెంట్ కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు. ఇంకో 30 సంవత్సరాలు మోడీ ప్రభుత్వం పక్కా. కంటోన్మెంట్తో నాకేంటి సంబంధం అంటున్న కేసీఆర్ కి ప్రజలే బుద్ది చెప్పాలి. కెసిఆర్ ఝూటా మాటలు, బట్టేబాజ్ మాటలు అన్నీ పోవాలి.

• జిహెచ్ఎంసిలో కెసిఆర్ లక్ష ఇండ్లు కట్టిస్తా అన్నాడు. కెసిఆర్ కు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు కట్టించాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా.

• తెలంగాణకు కేంద్రం 2,40,000 ఇండ్లను మంజూరు చేసింది. కేంద్రం మంజూరు చేసిన ఇండ్లను కేసీఆర్ ఎందుకు కట్టించడం లేదు? కేంద్రం ఇచ్చిన ఇండ్లను కేసీఆర్ కట్టిస్తే… మరో ఐదు లక్షల ఇండ్లవరకైనా కేంద్రం నుంచి మంజూరు చేయిస్తానని నేను ప్రకటించారు. అయినా కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు?

• పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించని కేసీఆర్… తాను మాత్రం 100 రూములతో ఇల్లు కట్టుకున్నాడు. రోజుకో రూమ్ లో తాగుతాడు… రోజుకో రూములో పంటాడు. దళిత బంధు, కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు ఏమయ్యాయి?

• ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కెసిఆర్ కూతురు ప్రమేయం ఉందన్న వీడియో బయటపడటంతోనే…. కేసీఆర్ అంబేద్కర్ నామస్మరణ చేస్తున్నాడు. అందుకే సచివాలయానికి ‘అంబేద్కర్’ పేరు అంటూ రాజకీయాలు చేస్తున్నాడు. దమ్ముంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు ముఖ్యమంత్రి సీటులో దళితుడిని కూర్చోబెట్టాలి. కొత్త సచివాలయంలో సీఎం కుర్చీలో దళితుడినే కూర్చోబెట్టే దమ్ముందా కేసీఆర్.

• ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. జీహెచ్ఎంసీ కార్మికులు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రేషన్ కార్డు, పెన్షన్, ఉద్యోగాలు.. ఇలా ఏది కావాలన్నా…. కేసీఆర్ కుటుంబానికి లంచం ఇవ్వాల్సిందే.

• సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్స్ లో… కేంద్ర బలగాల పరేడ్తో అధికారికంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవాన్ని’ నిర్వహిస్తున్నాం. ఉదయం ఎనిమిది గంటలకు పరేడ్ నిర్వహిస్తున్నాం.

• 8 సంవత్సరాల నుంచి ఎందుకు తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని కేసీఆర్ జరపడం లేదు? బిజెపి తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతుందని ప్రకటించిన తర్వాతే… బీజేపీ కి భయపడి, ఇప్పుడు ‘జాతీయ సమైక్యత దినోత్సవం’ జరుపుతున్నాడు. ఓవైసీకి భయపడే జాతీయ సమైక్యత దినం అంటున్నాడు.

• దారుస్సలాం నిర్ణయాలను తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేస్తున్నాడు. సొంత నిర్ణయాలను అమలు చేసే దమ్ము, ధైర్యం కేసిఆర్ కు లేదు. నిజాం మెడలు వంచి తెలంగాణకు స్వాతంత్రం తెచ్చిన ఘనత సర్దార్ పటేల్. ఉఫ్ అంటే ఊడిపోయే పార్టీ, టిఆర్ఎస్ పార్టీ. వెంటిలేటర్ పై ఉన్న పార్టీ టిఆర్ఎస్. ఎక్కడికి వెళ్లినా పైసలు దండుకుండే కేసీఆర్ నైజం.

Also Read : కేసీఆర్ పెద్ద గజదొంగ  బండి సంజయ్ ఫైర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్