Tuesday, April 16, 2024
HomeTrending Newsవచ్చే ఏడాది నుంచి విశాఖ ‘పరిపాలన’: గుడివాడ

వచ్చే ఏడాది నుంచి విశాఖ ‘పరిపాలన’: గుడివాడ

వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ పరిపాలనా రాజధానిగా ఉంటుందని,  దీనికి అందరూ సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. దీనిపై త్వరలోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెడతామని చెప్పారు.  వచ్చే ఫిబ్రవరిలో విశాఖపట్నం నగరంలో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నామని, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని సిద్ధం చేస్తున్నామని చెప్పారు.  అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద గుడివాడ  మాట్లాడారు.  బిల్లు ఈ సమావేశాల్లోనా, వచ్చే సమావేశాల్లోనా అనేది త్వరలోనే తేలుతుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్