Wednesday, February 21, 2024
Homeస్పోర్ట్స్ఫెదరర్ కు మిత్రుల అభినందనలు

ఫెదరర్ కు మిత్రుల అభినందనలు

టెన్నిస్ ప్రొఫెషనల్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోజర్ ఫెదరర్ కు సహచర టెన్నిస్ క్రీడాకారులు, ఇతర ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. రోజర్ తో తమకున్న అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ అతని రిటైర్మెంట్ జీవితం సుఖప్రదంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఇటీవలే ఆటకు గుడ్ బై చెప్పిన మహిళా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ‘రిటైర్మెంట్ క్లబ్’ లోకి ఫెదరర్ కు స్వాగతం చెప్పింది. దాదాపు ఇద్దరం ఒకేసారి టెన్నిస్ కెరీర్ మొదలు పెట్టమని చెబుతూ ఫెదరర్ తనకు ఎంతో స్పూర్తిగా నిలిచారని కొనియాడారు. ప్రపంచంలో టెన్నిస్ మాత్రమే కాకుండా తాను కలిసిన గొప్ప వ్యక్తుల్లో ఫెదరర్ ఒకరని చెప్పారు.

“ఓ డియర్ ఫ్రెండ్, ఆటలో నా ప్రత్యర్థి…. ఇలాంటి రోజు ఎప్పుడూ రాకూడదని కోరుకుంటున్నాను.  ప్రపంచ క్రీడా చరిత్రలో ఇదో విచారకరమైన రోజు. కానీ ఇన్నిరోజులపాటు నీతో కలిసి ఆడడం ఓ గౌరవంగా భావిస్తున్నా” అంటూ రఫెల్ నాదల్ వెల్లడించాడు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్  కూడా ఫెదరర్ కు అఅభినందనలు తెలిపాడు. “ఎంత గొప్ప కెరీర్ నీది ఫెదరర్…. మేమంతా నీ ప్రేమలో పడిపోయాం. క్రమంగా నీ ఆటకు మేం అలవాటుపడిపోయాం. ఈ అలవాటు మాకు జీవితంలో ఓ భాగమై పోయింది. నీతో ఎన్నో అద్భుతమైన రోజులు గడిపే అవకాశం లభిచడం నా అదృష్టం” అంటూ సంతోషం వ్యక్తం చేశాడు.

Also Read : Tennis: రోజర్ ఫెదరర్ రిటైర్మెంట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్