Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

హిందూ సమాజం చీలిపోతే తెలంగాణకు ప్రమాదకర పరిస్థితులు సంభవిస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిణామాలను బేరీజు వేసుకుంటే హిందువులంతా సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఈరోజు ఉదయం ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకుని 20 కేజీల లడ్డూను వినాయకుడికి సమర్పించారు. అనంతరం తరుణ్ చుగ్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్షులు గౌతమ్ రావు తదితరులు గణపతిని దర్శించుకున్నారు. అనంతరం హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు బండి సంజయ్, తరుణ్ చుగ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వారిని ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….

భాగ్యనగర్ లో అతి శక్తివంతమైన ప్రాముఖ్యత కలిగిన మహా గణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. దశాబ్దాలుగా మహా గణపతిని ప్రతిష్టిస్తూ ధార్మిక వాతావరణం నెలకొల్పేలా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు. ఆరోజు బ్రిటీష్ వారిని తరిమికొట్టడానికి హిందూ సమాజాన్ని ఏకం చేసేందుకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు. ఈరోజు కూడా కులాలు, మతాలకు అనుగుణంగా సంఘటితం కావాలి. హిందూ సమాజాన్ని కులాలు, వర్గాలు, వర్ణాలు, సంఘాల పేరుతో చీల్చే ప్రమాదం నుండి తప్పించి హిందూ సమాజాన్ని సంఘటితంగా మార్చడానికి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఉపయోగపడతాయి. మనతోపాటు సమాజం కూడా బాగుండాలని కోరుకునే వాడే నిజమైన హిందువు. నిస్వార్థంగా భగవంతుడిని కొలవాలి. హిందువుగా పుట్టడం మన పూర్వ జన్మసుకృతం. వారానికో పండుగ.. రోజుకో దేవుడిని కొలిచే గొప్ప సంస్కృతి మన హిందువులకే సొంతం.

నిరంతరం హిందూ సమజాం జాగృతం కావాలి. కులాల, వర్గాల, వర్ణాల, సంఘాల పేరుతో హిందూ సమాజం చీలిపోతే తెలంగాణకు అత్యంత ప్రమాదకరం. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను ఒక్కసారి బేరీజు వేసుకోవాలి. హిందూ సమాజమంతా సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైంది. హిందూ ధర్మానికి ఆపదొస్తే ప్రతి ఒక్క హిందువు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. హిందువులను సంఘటితం చేయడమే నవరాత్రి, వినాయకత చవితి పర్వదినాల లక్ష్యం.

Also Read : కేసీఆర్ పెద్ద గజదొంగ బండి సంజయ్ ఫైర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com