Sunday, June 7, 2026
Homeసినిమాడబ్బింగ్ లో 'డేగల బాబ్జీ'

డబ్బింగ్ లో ‘డేగల బాబ్జీ’

ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘డేగల బాబ్జీ’. వెంకట్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఏర్పడింది. అలాగే ఆమధ్య విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం కనులు మాత్రమే కనిపించేలా ముఖానికి కండువాతో కవర్ చేసిన బండ్ల గణేష్ కనిపిస్తుంటే… ఆయన కన్నుపై కత్తిగాటు, దానిపై వేసిన కుట్లు, గాయం నుండి కారుతున్న రక్తపు బొట్టు సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్ డేట్ ను బండ్ల గణేష్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. ఈ చిత్రం డబ్బింగ్ ఫుల్ స్వింగ్ లో ఉన్నట్లు తెలియచేశారు. అందుకు సంబంధించిన ఒక ఫోటో ను కూడా షేర్ చేసి.. ఇది పక్కా డిఫెరెంట్ ఫిల్మ్ అంటూ బండ్ల గణేష్ చెప్పారు. తన మాటలతో, ట్వీట్ లతో వార్తల్లో నిలిచే బండ్ల గణేష్ హీరోగా చేస్తున్న ఈ చిత్రం పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ, సినిమా మంచి విజయం సాధించాలి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు డేగల బాబ్జీ రెడీ అవుతున్నాడు. మరి.. ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular