Thursday, March 12, 2026
Homeసినిమాబండ్ల గణేష్ సినిమా షూటింగ్ షురూ

బండ్ల గణేష్ సినిమా షూటింగ్ షురూ

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ… రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే సినిమా చిత్రీకరణ ప్రారంభమై శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.

ఈ సందర్భంగా దర్శక – నిర్మాతలు మాట్లాడుతూ… “తమిళ హిట్ ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’కి‌ రీమేక్ ఇది. తమిళంలో ఆర్. పార్తిబన్ గారు పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ హీరో పాత్ర కోసం ఆయన పత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఆయన లుక్, యాక్టింగ్ అందరికీ సర్‌ప్రైజ్. సినిమా కూడా సర్ ఫ్రైజింగ్ గా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. నాన్‌స్టాప్‌గా సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాం” అని చెప్పారు.

ఈ చిత్రానికి కళా దర్శకత్వం: గాంధీ, ఛాయాగ్రహణం: అరుణ్ దేవినేని, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: లైనస్ మధిరి, నిర్మాణం: స్వాతి చంద్ర, దర్శకత్వం: వెంకట్ చంద్ర. ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ను హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.‌ చెన్నైలో ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular