Saturday, April 20, 2024
HomeTrending Newsవివాదాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

వివాదాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

2023 మార్చి నాటికి రాష్ట్రంలో వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష  పథకాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వెల్లడించారు. ఈమేరకు శనివారం అమరావతి సచివాలయంలో వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పధకం పై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. పెద్దిరెడ్డి తో పాటు ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ ధర్మాన కృష్ణదాస్, మంత్రి బొత్స సత్యనారాయణల ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈపధకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు సిఎం జగన్ మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ ఉపసంఘం తరచు సమావేశమై ఈపధకాన్ని ఏ విధంగా వేగవంతంగా ముందుకు తీసుకువళ్ళాలనే దానిపై చర్చిస్తున్నామని పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లోను వచ్చే 2023 మార్చి నాటికి ఊపధకాన్ని పూర్తిగా అమలు చేసేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నట్టు పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ప్రతివారం సమావేశామై సమీక్ష జరుపుతున్నామని ఈనెల 16న మరోసారి సమావేశం అవుతామని వెల్లడించారు.  ఈ పథకం అమలుకు సంబంధించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తలెత్తుతున్న భూ వివాదాలను ఎంత వేగంగా పరిష్కరించాలనే దానిపై నేడు ప్రధానంగా చర్చించామని  మంత్రి పేర్కొన్నారు. ఈ పధకం అమలు పూర్తయితే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు.

అంతకు ముందు ‘ఎబాలిషన్ ఆఫ్ ఈనామ్ యాక్టు’పై మంత్రుల సాధికార కమిటీ సమావేశం ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ ల ఆధ్వర్యంలో జరిగింది. ఈ చట్టానికి సంబంధించిన వివిధ అంశాలపై మంత్రుల బృందం చర్చించింది. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్