Bangla won: బే ఓవల్ టెస్టులో బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్లతో ఘన విజయం సాధించి ఆతిథ్య న్యూజిలాండ్ కు షాక్ ఇచ్చింది. బంగ్లా బౌలర్ ఎబాదత్ హోస్సేన్ రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లతో రాణించి కీవీస్ ను దెబ్బతీశాడు. ఐదు వికెట్లకు 147 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేడు ఐదోరోజు ఆట మొదలు పెట్టిన న్యూజిలాండ్ మరో 22 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. నిన్న37తో క్రీజులో ఉన్న రాస్ టేలర్ మరో మూడు పరుగులు మాత్రమే చేసి 40 వద్ద ఔటయ్యాడు. రచిన్ రవీంద్ర 16 పరుగులు చేశాడు. కీవీస్ లో మొత్తం నలుగురు ఆటగాళ్ళు డకౌట్ అయ్యారు.
చారిత్రాత్మక విజయానికి 40 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ రెండు వికెట్లు కోల్పోయి సాధించింది. ఓపెనర్లు షాద్మాన్ ఇస్లాం-3; నజ్ముల్ హోస్సేన్-17 పరుగులు చేశారు. మొనిముల్ హక్-13; ముష్ఫిఖర్ రహీమ్-5 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. కివీస్ బౌలర్లలో సౌతీ, జేమిసన్ చెరో వికెట్ తీసుకున్నారు.
ఈ మ్యాచ్ లో మొత్తం ఏడు వికెట్లు తీసుకున్న బంగ్లా బౌలర్ ఎబాదత్ హోస్సేన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.
ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ లో బంగ్లా 1-0 ఆధిక్యంతో ఉంది. రెండో టెస్ట్ జనవరి 9 నుంచి క్రైస్ట్ చర్చ్ లో మొదలు కానుంది.
Also Read : హుస్సేన్ దెబ్బకు కివీస్ విల విల