Monday, January 27, 2025
Homeస్పోర్ట్స్BAN Vs. AFG: ఢాకా టెస్టులో బంగ్లా పైచేయి

BAN Vs. AFG: ఢాకా టెస్టులో బంగ్లా పైచేయి

ఆఫ్ఘనిస్తాన్ తో స్వదేశంలో జరుగుతోన్న ఏకైక టెస్టు మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. నిన్న తొలిరోజు మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 362 పరుగులు చేసిన బంగ్లాదేశ్ మరో 20 పరుగులే చేసి ఆలౌట్ అయ్యింది. నజ్ముల్ హుస్సేన్ శాంటో-146; మహ్ముదుల్ హాసన్-79; మెహిది హసన్-48; ముష్ఫిఖర్ రహీం-47 పరుగులతో రాణించారు. ఆఫ్ఘన్ బౌలర్ నిజత్ మసూద్-5; అహ్మద్ జై-2; జహీర్ ఖాన్, అమీర్ హంజా, రహ్మత్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆఫ్ఘన్ 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జజాయ్-36; నసీర్ జమాల్-35; కరీం జనత్-23 రన్స్ మాత్రమే చేయగలిగారు. బంగ్లా బౌలర్లలో ఎబాదోత్ హుస్సేన్ 4;  షోరిఫుల్ ఇస్లాం, తైజుల్ ఇస్లాం, మెహిదీ హాసన్ తలా 2 వికెట్లు పడగొట్టారు.

నేడు రెండో రోజే తుది ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆతిథ్య బంగ్లా జట్టు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 134 పరుగులు చేసింది. మహ్ముదుల్ హసన్ 17 పరుగులు చేసి ఔట్ కాగా, జాకీర్ హసన్­-54; నజ్ముల్ హుస్సేన్ శాంటో-54 పరుగులతో క్రీజులో ఉన్నారు.

బంగ్లాదేశ్ మొత్తంగా 370 పరుగుల ఆధిక్యంలో ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్