ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతోన్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ విజయం దిశగా సాగుతోంది. 4 వికెట్లకు 425 వద్ద రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన బంగ్లా 662 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఫ్ఘన్ ముందుంచింది. నేడు మూడో ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో 45 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. పరుగుల ఖాతా తెరవక ముందే ఓపెనర్ ఇబ్రహీం జర్దాన్ ఔటయ్యాడు. అబ్దుల్ మాలిక్-5 పరుగులు చేసి అవుట్ కాగా, కెప్టెన్ అస్మతుల్లా షాహిది రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.
రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ కోల్పోయి 134 పరుగులతో నేటి ఆట మొదలు పెట్టిన బంగ్లాదేశ్ లో…. ఓపెనర్ జాకీర్ హాసన్ 71 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. శాంటో 124 పరుగులు చేసి అవుట్ కాగా, మోమినుల్ 121; లిట్టన్ దాస్-71 రన్స్ తో నాటౌట్ గా నిలిచారు. రెండో వికెట్ కు జాకీర్ హాసన్- శాంటో 173; మోమినుల్-లిట్టన్ లు ఐదో వికెట్ లు 143 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం.
ఆఫ్ఘన్ బౌలర్లలో జహీర్ ఖాన్ 2; అమీర్ హంజా ఒక వికెట్ పడగొట్టారు.
ఆఫ్ఘన్ ఇంకా 616 పరుగులు వెనకబడి ఉంది, ఎనిమిది వికెట్లు చేతిలో ఉన్నాయి.