Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Eng Vs. Ban: తొలి టి20లో బంగ్లా విజయం

Eng Vs. Ban: తొలి టి20లో బంగ్లా విజయం

ఇంగ్లాండ్ తో జరుగుతోన్న టి 20 సిరీస్ లో భాగంగా నేడు జరిగిన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది. చిట్టగాంగ్ లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరిగిన నేటి మ్యాచ్ లో బంగ్లా టాస్ గెలిఛి బౌలింగ్ ఎంచుకుంది.

ఇంగ్లాండ్ లో కెప్టెన్ జోస్ బట్లర్ 42బంతుల్లో  4ఫోర్లు, 4సిక్సర్లతో 67; సాల్ట్ 35 బంతుల్లో  4 ఫోర్లు, 1సిక్సర్ తో 38; డకెట్ 20 రన్స్ చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది.

బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మూద్ 2;  నసమ్ ఆహ్ముద్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజూర్, షకీబ్ తలా ఒక వికెట్ సాధించారు.

బంగ్లా బ్యాట్స్ మెన్ నజ్ముల్ శాంటో 30 బంతుల్లో 8 ఫోర్లతో 51;  కెప్టెన్ షకీబ్-34; తౌహీద్-24  పరుగులతో రాణించడంతో 18 ఓవర్లలోనే 158 పరుగులు చేసి విజయం అందుకుంది.

ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, మోయీన్ అలీ తలా ఒక వికెట్ పడగొట్టారు.

నజ్ముల్ శాంటో కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

మూడు మ్యాచ్ ల సిరీస్ లో బంగ్లా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్