Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్Eng Vs Ban: మూడో వన్డేలో బంగ్లా గెలుపు

Eng Vs Ban: మూడో వన్డేలో బంగ్లా గెలుపు

ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ 50 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి 246 పరుగులు చేసిన బంగ్లాదేశ్… ఇంగ్లాండ్ ను 196 పరుగులకే ఆలౌట్ చేసింది.

చిట్టగాంగ్ లోని జహూర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శామ్ కర్రన్ దెబ్బకు 17 పరుగులకే ఓపెనర్లు ఇద్దరూ (తమీమ్ ఇక్పాల్ -11; లిట్టన్ దాస్ – డకౌట్) పెవిలియన్ చేరారు. నజ్ముల్ శాంటో- ముస్ఫిఖర్ రెహ్మాన్ లు మూడో వికెట్ కు 98 పరుగులు జోడించారు. శాంటో-50; ముస్ఫిఖర్-70 రన్స్ చేసి ఔట్ కాగా, షకీబ్ అల్ హసన్ 75 పరుగులతో రాణించాడు. 48.5 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ఇంగ్లాండ్ బౌలర్లలో మోయిన్ అలీ-3;  శామ్ కర్రన్, ఆదిల్ రషీద్ చెరో 2;  క్రిస్ ఓక్స్, రెహాన్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ లో జేమ్స్ వీన్స్-38; ఫిలిప్ సాల్ట్-35; క్రిస్ ఓక్స్-34; జోస్ బట్లర్-26; శామ్ కర్రన్-23  మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. 43.1  ఓవర్లలో 196 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. తైజుల్ ఇస్లామ్, ఎబాదత్ హోస్సేన్ చెరో 2; ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.

షకీబ్ అల్ హసన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’, ఆదిల్ రషీద్ కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ దక్కాయి.

వన్డే సిరీస్ ను 2-1 తో ఇంగ్లాండ్ గెల్చుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్