Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్ఫ్రెంచ్ ఓపెన్  క్రెజికోవాదే!

ఫ్రెంచ్ ఓపెన్  క్రెజికోవాదే!

చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బోరా క్రెజికోవా ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో రష్యాకు చెందిన అనస్తాశియా పవ్లిచెంకోవా పై నెగ్గి తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెల్చుకున్నారు.  తొలిసెట్ 6-1తో గెల్చుకున్న క్రెజికోవా 2-6 తో రెండో సెట్ ఓడిపోయింది అయితే తిరిగి పుంజుకొని  6-4 తో మూడో సెట్ గెల్చుకొని ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని ముద్దాడింది.

గత ఐదేళ్ళలో అన్ సీడెడ్ ఆటగాళ్ళు ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా అవతరించడం ఇది మూడోసారి. ఒకే ఏడాదిలో ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్, డబుల్స్ రెండు టైటిల్స్ గెల్చుకున్న క్రీడాకారిణి గా కూడా క్రెజికోవా చరిత్ర సృష్టించనున్నారు. 2000  సంవత్సరంలో మేరీ పియర్స్ ఈ ఘనత సాధించారు.

సింగిల్స్ విజేతగా అవతరించిన క్రెజికోవా రేపు జరిగే డబుల్స్ ఫైనల్ లో తన దేశానికే చెందిన సినికోవాతో కలిసి స్వైటేక్ (పోలాండ్), మత్తెక్ సాన్డ్స్(అమెరికా) జోడీతో తలపడనుంది. ఒకవేళ క్రెజికోవా జోడీ ఓటమి పాలైనా రన్నరప్ గా నిలుస్తారు. ఇలా ఒకే ఏడాది సింగిల్స్, డబుల్స్ గెల్చుకున్న క్రీడాకారిణిగా ఆమె రికార్డు సాధిస్తారు.

మరోవైపు సెర్బియాకు చెందిన నోవాక్ జకోవిచ్, గ్రీక్ కు చెందిన సిట్సిపాస్ ల మధ్య మెన్స్ సింగిల్స్ ఫైనల్ ఆదివారం జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్