Tuesday, June 9, 2026
HomeTrending Newsఖతర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఖతర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో ఖతర్ దేశంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. దోహలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి  భారీగా హజరైన ఖతర్ తెలుగు మహిళలు, తెలంగాణ బిడ్డలు. ముఖ్య అతిథిగా ఖతర్ లోని భారత రాయబారి డా. దీపక్ మిట్టల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత. ఖతర్ లో జరుగనున్న ప్రపంచ కప్ ఫుట్ బాల్ కోసం ఖతర్ ప్రభుత్వం నిర్మించిన అత్యాధునిక స్టేడియంల వద్ద బతుకమ్మలతో పాట విడుదల చేశామని తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని తెలిపారు.

కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఖతర్ భారత రాయబారి డా. దీపక్ మిట్టల్ , వారి సతీమణి శ్రీమతి అల్పన మిట్టల్  హాజరు కాగా ఐసీబీఎఫ్ అధ్యక్షులు వినోద్ నాయర్ ,ఐసీసీ ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం హెబ్బగెలు, ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ కుమార్, ఐసిసి అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ ప్రసాద్ కోడూరి, ఐసీబీఎఫ్ ఎంసీ రజినీ మూర్తి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.

సాంస్కృతిక కార్య్రమాల్లో భాగంగా జరిగిన కార్యక్రమాల్లో చిన్నారులు, ఆడపడుచులు బతుకమ్మ ఆట పాటలతో అలరించగా గల్ఫ్ కార్మిక సోదరులు సైతం పల్లె పాటలతో ధూమ్ దాం నిర్వహించారు. అన్ని వర్గాల మద్దతుతో పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమంలో దాదాపుగా 1500 పైగా పాల్గొన్నారు, అనంతరం బతుకమ్మలను నీళ్లలో వదిలి సత్తు పిండి ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular