Saturday, January 18, 2025
HomeTrending Newsఐసీఐసీఐతో బీసీ సంక్షేమ శాఖ ఒప్పందం

ఐసీఐసీఐతో బీసీ సంక్షేమ శాఖ ఒప్పందం

రాష్ట్రంలోని బీసీల సమున్నత అభివృద్ధి ధ్యేయంగా బీసీ సంక్షేమ శాఖ నిరంతరం కృషి చేస్తుంది, ఇందులో బాగంగా ప్రపంచ స్థాయి డిమాండ్ ఉన్న సాప్ట్ వేర్ ఇంజనీరింగ్, సాప్, అకౌంటెన్సీ తదితర ప్రొపెషనల్ కోర్సుల్లో బీసీ యువతకు నాణ్యమైన శిక్షణను అందించేందుకు బీసీ సంక్షేమ శాఖ  నేడు హైదరాబాద్లోని మంత్రి గంగుల కార్యాలయంలో ఐసీఐసీఐ అకాడమీ ఫర్ స్కిల్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది. బీసీ, ఎంబీసీ కార్పోరేషన్లతో కలిసి ఐసీఐసీఐ అకాడమీ సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రపంచ స్థాయి శిక్షణను పూర్తి ఉచితంగా నిర్వహించనున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలియజేసారు. బ్యాచ్ కు మూడు నెలల పాటు అందించే ఈ ఉచిత శిక్షణను 8వ తరగతి నుండి డిగ్రీ పూర్తి చేసిన బీసీ యువత సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మంత్రి సూచించారు. విద్యార్హతలు, అభ్యర్థి ఇష్టానుసారం ఆయా కోర్సుల్లో శిక్షణ అందిస్తామన్నారు. జిల్లా బీసీ సంక్షేమ అధికారి కార్యాలయంతో పాటు కార్పోరేషన్ల కార్యాలయాన్ని సంప్రదించి ఉచిత శిక్షణకు నమోదు చేసుకోవాలని సూచించారు. మొదటి విడుతలో అర్హులైన అభ్యర్థులకు హైదరాబాద్ కేంద్రంగా అత్యుత్తమ శిక్షణను ఉచితంగా అందిస్తామన్నారు మంత్రి గంగుల కమలాకర్.

ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని సగర్వంగా తమ కాళ్లపై తాము నిలబడాలని బీసీ యువతకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సూచించారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దమౌతున్న బీసీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా నాణ్యమైన శిక్షణ అందజేస్తున్నామని, సాప్ట్ వేర్ ఇంజనీర్, సాప్, అకౌంటెన్సీ తదితర ప్రొపెషనల్ కోర్సుల్లోనూ నాణ్యమైన శిక్షణను ఐసీఐసీఐ అకాడమీ తో కలిసి ఉచితంగా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారి బాలాచారి, ఐసీఐసీఐ అకాడమీ ప్రతినిధులు సుఖేతు కుమార్, బి.వెంకటేశ్, ఎస్. గిరీష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్