Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్No Discrimination: పురుషులతో సమానంగా మహిళలకూ మ్యాచ్ ఫీజ్

No Discrimination: పురుషులతో సమానంగా మహిళలకూ మ్యాచ్ ఫీజ్

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) నేడు కీలక నిర్ణయం తీసుకుంది. పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు కూడా మ్యాచ్ ఫీజు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. విచక్షణకు తావు లేకుండా ఇద్దరికీ సమానంగా చెల్లింపులు ఉండాలన్న నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉందని బిసిసిఐ కార్యదర్శి  జై షా వెల్లడించారు. తన అభిప్రాయానికి మద్దతుగా నిలిచినా అపెక్స్ కౌన్సిల్ కు కృతజ్ఞతలు తెలిపాడు.

ఇకపై పురుషుల జట్టుతో సమానంగా మహిళలకూ… టెస్టు మ్యాచ్ సమయంలో ఒక్కో ప్లేయర్ కు రూ.15 లక్షలు, వన్డే మ్యాచ్ కు రూ. 6 లక్షలు, టి20 మ్యాచ్ కు 3లక్షల రూపాయలు మ్యాచ్ ఫీజు ఇవ్వనుంది.

జై షా ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఇటీవల మహిళా క్రికెట్ జట్టు ఆసియా కప్ గెలిచిన ఫోటోను షేర్ చేశాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్