Friday, January 24, 2025
HomeTrending Newsసెప్టెంబర్ లో ఐపిఎల్: బిసిసిఐ నిర్ణయం

సెప్టెంబర్ లో ఐపిఎల్: బిసిసిఐ నిర్ణయం

కోవిడ్ కారణంగా వాయిదా పడిన ఐపిఎల్-2021 సీజన్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో  పూర్తి చేయాలని బిసిసిఐ నిర్ణయించింది. నేడు జరిగిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్-అక్టోబర్ నెలలలో మిగిలిన మ్యాచ్ లు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

కోవిడ్ కారణంగా ఐపిఎల్-2021 సీజన్ ను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మొత్తం 60మ్యాచ్ లు జరగాల్సి ఉండగా 29 మాత్రమే పూర్తయ్యాయి. మరో 31మ్యాచ్ లు జరగాల్సి ఉంది.  వీటిని 21 రోజుల్లో పూర్తి చేసేలా షెడ్యూల్ తయారు చేస్తున్నారు. 10 రోజులపాటు రెండేసి, ఏడు రోజులపాటు ఒక్కటి, మరో నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్ లు నిర్వహిస్తారు.

అక్టోబర్, నవంబర్ నెల్లల్లో జరగాల్సిన టి-20 వరల్డ్ కప్ కంటే ముందే ఐపిఎల్ ముగియనుంది. ఐపిఎల్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరాలని ఫ్రాంచైజీ ల యజమానులు, స్పాన్సర్లు ఒత్తిడి తెస్తున్నారు.

మరోవైపు, అక్టోబర్ నవంబర్  నెలల్లో  మనదేశంలో జరగాల్సిన టి-20 వరల్డ్ కప్ పై తుది నిర్ణయం తీసుకునేదుకు మరికొంత సమయం ఇవ్వాలని ఐసిసిని బిసిసిఐ కోరింది. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఈ క్రికెట్ వేడుకను కూడా ఎమిరేట్స్ లోనే జరపాలని ఐసిసి ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం కోవిడ్ రెండో దశ కొద్దిగా తగ్గుముఖం పడుతున్న దృష్ట్యా ఇప్పటికిప్పుడు ఈ ఈవెంట్ ను తరలించే నిర్ణయం అవసరం లేదని బిసిసిఐ అభిప్రాయపడుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్